వెంకటేష్ కు ఓకే, మరి రవితేజ పరిస్థితేమిటి ?

వెంకటేష్ కు ఓకే, మరి రవితేజ పరిస్థితేమిటి ?

Published on Jun 20, 2022 9:00 PM IST

క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ‘రవితేజ – వెంకీ’ కలయికలో భారీ మల్టీస్టారర్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ కి శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పాడని, వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని రూమర్స్ వస్తున్నాయి. అలాగే, త్వరలోనే రవితేజకు కూడా కథ వినిపించబోతున్నాడట.

మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే నిర్మాత దిల్ రాజు, వెంకీ – రవితేజ హీరోలుగా ఓ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట. డైరెక్టర్ ‘శ్రీకాంత్ అడ్డాల’ చేత మల్టీస్టారర్ కథ చేయించింది దిల్ రాజునే అని టాక్ నడుస్తోంది. మరి ఇద్దరి హీరోల ఇమేజ్ కోసం శ్రీకాంత్ ఎలాంటి కథ రాశాడో చూడాలి.

అన్నట్టు ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల బాలయ్యతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు, బాలయ్య అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అవుతున్నాడని టాక్ నడిచింది. ఏది ఏమైనా శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు