అసురన్ కోసం వెంకీ ఫుల్ మేక్ ఓవర్ కానున్నాడట.

Published on Nov 10, 2019 9:46 pm IST

కెరీర్ ప్రారంభం నుండి పొరుగున ఉన్న ఏ చిత్ర పరిశ్రమ నుండి ఓ మంచి చిత్రం వచ్చినా దానిని తెలుగు ప్రేక్షకులకు అందించే పనిలోముందుంటాడు విక్టరీ వెంకటేష్. ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేసి వెంకీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నారు. ఈ మధ్య కాలంలోనే బాడీ గార్డ్, మసాలా, దృశ్యం, గురు, గోపాలా గోపాలా ఇలా అనేక రీమేక్ చిత్రాలలో వెంకటేష్ నటించడం జరిగింది. ఇక తాజాగా ఆయన ధనుష్ నటించిన లేటెస్ట్ తమిళ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

కాగా ఈమూవీ కోసం వెంకీ కంప్లీట్ గా తనని తాను మార్చుకోనున్నారని సమాచారం. అసురన్ చిత్రంలో ధనుష్ డీగ్లామర్ రోల్ చేశారు. పెళ్లి వయసుకొచ్చిన ఒక కొడుకుతో పాటు, మరో ఇద్దరు పిల్లలు కలిగిన మధ్య వయస్కుడి పాత్ర చేయడం జరిగింది. అణగారిన వర్గానికి చెందిన పేదరైతు పాత్రలో వెంకీ కనిపించాల్సివుంది. దాని కోసం వెంకీ చాలా కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. గతంలో వెంకీ పూర్తి స్థాయి డీగ్లామర్ రోల్ చేసిన దాఖలాలు లేవు. మరి ఈ ఛాలెంజింగ్ రోల్ వెంకీ ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తికరం.

సంబంధిత సమాచారం :

More