మొదటి సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్న వెంకటేష్

మొదటి సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్న వెంకటేష్

Published on Jun 30, 2014 11:40 AM IST

Venkatesh-(28)
బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతున్న ‘అల్లుడు శీను’ ఆడియో నిన్న విడుదలైంది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన విక్టరీ వెంకటేష్ గ్రాండ్ గా చేసిన ఆ ఫంక్షన్ చూసి తన మొదటి సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

‘నా మొదటి సినిమా సమయంలో కూడా నాన్నగారు చాలా గ్రాండ్ ఫంక్షన్ చేసి, అందరి సెలబ్రిటీల మధ్య గ్రాండ్ గా నన్ను లాంచ్ చేసారు. బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం చేసిన ఈ ఫంక్షన్ చూస్తుంటే నాకు ఆరోజులు గుర్తోస్తున్నాయని’ వెంకటేష్ అన్నాడు. శిల్పకళావేదికలో జరిగిన ఈ ఆడియో వేడుకకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తాజా వార్తలు