అంజలి మంచి ఆర్టిస్ట్.. ‘లిసా’కీ నా బెస్ట్ విషెస్ – వెంకటేష్

Published on May 16, 2019 10:08 pm IST

ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ లిసా. కాగా “లిసా” ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ ఈ రోజు (గురువారం) సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. సురేష్ కొండేటి కి లిసా యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు

ఇక తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మకరంద్ దేశ్ పాండే , యోగి బాబు , సామ్ జోన్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More