మళ్లీ కామెడీ టైమింగ్‌ ని చూపించనున్న వెంకీ !

Published on Dec 30, 2018 10:16 pm IST


దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. వెంకటేస్‌ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాలో ఆకట్టుకోబోతున్నాడని.. మళ్లీ మనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలోని తన కామెడీని గుర్తుకు తెస్తారని తెలిపారు.

దీన్ని బట్టి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించారని అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :