విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ కి పచ్చ జెండా ఊపారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం దృశ్యం 2 ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నారు. మోహన్ లాల్, మీనా జంటగా తెరకెక్కిన దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడం జరిగింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈమూవీని వెంకటేష్ చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. దృశ్యం 2 మలయాళ యూనిట్ వెంకటేష్ ని నేడు కలిసి ఈ విషయాన్ని ధృవీకరించారు.
2013లో విడుదలైన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్. అప్పుడు కూడా మోహన్ లాల్ చేసిన ఆ చిత్రాన్ని వెంకటేష్ 2014లో రీమేక్ చేసి విజయం సాధించారు. ఆ చిత్రానికి ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. కానీ దృశ్యం 2 సీక్వెల్ కి ఒరిజినల్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెరకెక్కించనున్నాడని సమాచారం.
ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 తో పాటు నారప్ప చేస్తున్నారు. వీటిలో నారప్ప రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తమిళంలో విడుదలై విజయం సాధించిన అసురన్ చిత్రానికి నారప్ప రీమేక్. తెలుగులో శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Telugu remake of #Drishyam2 is on ????
Starting in March. pic.twitter.com/qnoSPvMwEH— Antony Perumbavoor (@antonypbvr) February 20, 2021


