సరైన దర్శకుడి కోసం వెంకీ, సురేష్ బాబు వెతుకులాట

Published on Nov 8, 2019 1:26 pm IST

ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న తమిళ చిత్రాల్లో ధనుష్ నటించిన ‘అసురన్’ కూడా ఒకటి. వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని కంటెంట్, ధనుష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని చూసిన విక్టరీ వెంకటేష్ వెంటనే తెలుగులోకి రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు. ఈ సినిమాను సురేష్ బాబు స్వయంగా నిర్మించనున్నారు.

ఇక ‘అసురన్’ సినిమా అంత గొప్పగా రావడానికి, ధనుష్ పెర్ఫార్మెన్స్ భీభత్సమైన రీతిలో పండటానికి ప్రధాన కారణం వెట్రి మారన్ డైరెక్షన్. అందుకే అలాంటి విజన్ ఉన్న దర్శకుడినే రీమేక్ కోసం ఎంచుకోవాలని, లేకుంటే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదముందని వెంకీ, సురేష్ బాబులు భావిస్తున్నారు. అందుకే ఉన్న యువ దర్శకుల్లో ఎవరు డైరెక్ట్ చేయగలరనే విషయాన్ని రూఢీ చేసుకోవడానికి వారిద్దరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. మరి వారి ప్రయత్నాలు ఫలించి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More