వెంకీ కోసం స్క్రిప్ట్ రాస్తోన్న స్టార్ డైరెక్టర్ !

Published on Apr 1, 2019 4:44 pm IST

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగినప్పటికీ వినాయక్ కి ప్రస్తుతం పరిస్థితులు పెద్దగా అనుకూలించట్లేదు. నట సింహం నందమూరి బాలకృష్ణతో ఎప్పుడో మొదలు ఆవ్వాల్సిన సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. దీనికి తోడు మరో పక్క బాలయ్య బోయపాటితో ఫిక్స్ అయిపోయాడు. దాంతో వినాయక్ ఇక చేసేదేం లేక ఆ మధ్యన వెంకటేష్ కి ఓ లైన్ చెప్పాడు.

ప్రస్తుతం వినాయక్ ఆ లైన్ మీదే వర్క్ చేస్తున్నాడట. ఈ సినిమాకి రచయిత గోపిమోహన్ కూడా రచన చేస్తున్నారు. ఇక గతంలో వెంకటేష్ తో కలిసి ‘లక్ష్మి’ సినిమాను రూపొందించాడు వినాయక్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈసారి వెంకీకి వినాయక్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :