మహర్షి కి కూడా వెంకీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా .. ?

Published on May 1, 2019 11:15 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘మహర్షి’ విడుదలకు సిద్దమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో సాయంత్రం 6గంటలకు గ్రాండ్ గా జరుగనుంది. ఇక ఈవెంట్ కు అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రానున్నాడు.

వెంకీ రీసెంట్ గా మజిలీ ,జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాగా ఈ రెండు చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి మహర్షి కి కూడా వెంకీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. ఇక అలాగే ఈ ఈవెంట్ కు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరుకానున్నాడు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More