“అనబెల్ అండ్ సేతుపతి” ట్రైలర్ ను విడుదల చేయనున్న విక్టరీ వెంకటేష్!

Published on Aug 30, 2021 2:30 pm IST


విజయ్ సేతుపతి మరియు తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అనబెల్ అండ్ సేతుపతి. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ల ను చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రచార చిత్రాలక ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు బాషలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్లాన్ వేసింది అని చెప్పాలి. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ను ప్రముఖ టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేయనున్నారు.

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విక్టరీ వెంకటేష్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం లో రాధిక శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :