వైరల్ అవుతున్న మామ అల్లుళ్ళ సూపర్ లుక్

Published on Nov 8, 2019 11:00 pm IST

ఆఫ్ స్క్రీన్ మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఆన్ స్క్రీన్ మామా అల్లుళ్లుగా చేస్తున్న చిత్రం వెంకీ మామ. నిన్న వెంకీ మామ మూవీ టైటిల్ సాంగ్ విడుదల చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. కాగా ఈ మామ అల్లుళ్ళు షూటింగ్ సెట్స్ లో స్టైలిష్ గా నిలుచున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామ అల్లుళ్ళ పోజ్ చూసిన అందరూ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఈమూవీ విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సివుంది.

యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందించారు. ఈ చిత్రం తరువాత వెంకీ తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :