‘గోపాల గోపాల’ కోసం భూకంపంలో చిక్కుకున్న వెంకటేష్

‘గోపాల గోపాల’ కోసం భూకంపంలో చిక్కుకున్న వెంకటేష్

Published on Oct 29, 2014 12:13 PM IST

Venkatesh-(124)
స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీమల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఓ షాప్ ఓనర్ గా కనిపించనున్నాడు. ఒక సామాన్యుడు తనకు జరిగిన నష్టానికి కారణం దేవుడని, దేవుడిపై ఆస్తినష్టం కేసు పెట్టే కథాశం చుట్టూ తిరిగే ఈ సినిమా బాలీవుడ్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్.

ఈ సినిమాలో కథానుగుణంగా భూకంపం బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. ప్రస్తుతం భూకంపం సీన్స్ ని వెంకటేష్ పై రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో వెంకటేష్ తో పాటు కృష్ణుడు కూడా పాల్గొంటున్నాడు. వెంకటేష్ సరసన శ్రియ శరన్ కనిపించనున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించనున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు