తరుణ్ భాస్కర్ సినిమా పై వెంకీ స్పందన !

Published on Jul 17, 2021 6:04 pm IST

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా వెంకటేష్ మాట్లాడారు. నారప్ప ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకీ, తరుణ్ భాస్కర్ సినిమా గురించి అడిగితే..ఏది మన చేతిలో లేదమ్మా’ అంటూనే తరుణ్ భాస్కర్ ఇంకా ఏదో రాస్తున్నాడని చూద్దాం అంటూ స్పదించారు.

అయితే, ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తరుణ్ తో పాటు వెంకటేష్ కూడా అంత బాగా సంతృప్తి చెందలేదని, అందుకే.. సినిమాని పోస్ట్ పోన్ చేశామని.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ బాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా తరుణ్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసేశాడట. ఇక ఈ సినిమాని సమ్మర్ తరువాత నుండి మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ‘ఎఫ్ 3’ షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందట.

కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :