ఆ విషయంలో వెంకీ,చైతు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు

Published on Jul 17, 2019 6:56 am IST

రియల్ మామ అల్లుళ్లయిన వెంకటేష్,నాగ చైతన్య రీల్ మామ అల్లుళ్లుగా చేస్తున్న చిత్రం “వెంకీ మామ”. ఎన్టీఆర్ తో “జై లవకుశ” వంటి హిట్ తరువాత డైరెక్టర్ బాబీ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రం గురించి మీడియాలో చాలా కాలంగా ఎంటువంటి అప్డేట్ లేకపోవడం వెంకటేష్,నాగ చైతన్య అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారట. ఎప్పుడో ఓ నెల క్రితం ఈ మూవీ చిత్రీకరణ కాశ్మీర్ లో జరుగుతుందన్న సమాచారం తరువాత ఈ చిత్రంపై ఎటువంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇప్పటివరకు వెంకీ మామ టైటిల్ పోస్టర్ మినహా ఈ మూవీ లో వెంకీ,చైతూల లుక్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం అభిమానులకు కొంచెం రుచించని అంశమే.మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకొని వెంకీ మామ చిత్రంపై ఏమైనా ఆసక్తికర అప్డేట్ ఇస్తారేమో చూడాలి. దసరా కానుకగా విడుదల అయ్యేఅవకాశం ఉన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :