లెక్చరర్ గా నటించబోతున్న వెంకీ !

లెక్చరర్ గా నటించబోతున్న వెంకీ !

Published on Oct 18, 2020 7:30 PM IST

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. అయితే మధ్యలో కరోనా రావడంతో వెంకీ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నారప్ప షూటింగ్ వచ్చే ఏడాదే ఉంటుందని వెంకీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికే తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌ ను కూడా పూర్తి చేశాడు. తాజాగా ఫుల్ స్క్రిప్ట్ విన్న వెంకీ మరియు సురేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఉంటుందని తెలుస్తోంది. నారప్ప షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందట.

కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ‘వెంకీ’ నుండి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు