వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్

వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్

Published on Nov 14, 2019 11:59 AM IST

venky1

మొదటి సినిమాతోనే తమలో స్టఫ్ ఉందని నిరూపించుకున్న యువ దర్శకుల్లో వెంకీ కుడుముల కూడా ఒకరు. తొలి చిత్రం ‘ఛలో’ మంచి హిట్ కావడంతో నితిన్ హీరోగా ‘భీష్మ’ సినిమాను సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అంతేకాదు సినినా బాగుంటుందనే నమ్మకం కూడా ఏర్పడింది.

నిర్మాతలు కూడా టీజర్ చూసి వెంకీ వన్ టైమ్ వండర్ కాదని నిశ్చయించుకుని అతనితో సినిమా చేసే యోచనలో ఉన్నారు. వారిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఉన్నారట. వెంకీ తర్వాతి సినిమాను వీరే నిర్మిస్తారనే బలమైన టాక్ ఉంది. మైత్రీ మూవీస్ అంటే మీడియమ్ రేంజ్ హీరోల నుండి బడా హీరోల వరకు ఎవరి డేట్స్ అయినా సులభంగానై సెట్ చేసుకోగలదు. మరి వెంకీ కుడుముల చేతిలో ఏ హీరోను పెడతారో చూడాలి. ఇకపోతే ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుడలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు