‘వెంకీ మామ’ మొదటి రోజు నుండే కామెడీ !

‘వెంకీ మామ’ మొదటి రోజు నుండే కామెడీ !

Published on Feb 24, 2019 5:08 PM IST

Venky chay

యువ సామ్రాట్ నాగచైతన్య – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తుండంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా ఈ చిత్రం ఈ రోజు నుండి రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌లో మొదటి రోజు షూటింగ్ ను కామెడీ సీన్స్ తో ప్లాన్ చేశారు. కాగా ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీకి పాయల్ రాజ్ పుత్‌ జోడిగా నటిస్తోంది.

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. అలాగే నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం.

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు