విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొనడంతో నిర్మాతల నుండి అప్డేట్ ఏదైనా వస్తుందా అని చూస్తున్నారు అభిమానులు.
వారికోసమే అన్నట్టు రేపు 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆడియోలోని మొదటి పాటను విడుదల చేయనున్నారు టీమ్. ఈ పాట సినిమా థీమ్ సాంగ్ అని తెలుస్తోంది. అంటే మామ అల్లుళ్లు నాగ చైతన్య, వెంకటేష్ మధ్యన నడిచే సాంగ్ అన్నమాట. ఈ పాట తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని, ఈ పాటను ప్రతి మామ అల్లుళ్లకు డెడికేట్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.
ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


