“వెంకీమామ” తో కలిసి కాశ్మీర్ వెళ్లనున్న అల్లుడు చైతు.

Published on May 17, 2019 11:00 pm IST

ఆఫ్ స్క్రీన్ మామాఅల్లుళ్ళు వెంకటేష్ ,నాగ చైతన్య ఆన్ స్క్రీన్ మామాఅల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం “వెంకీ మామ”. కే.స్ రవీంద్ర(బాబీ) ఈ మూవీని ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడని సమాచారం. వెంకీ మామ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ని కాశ్మీర్లో చిత్రికరించాలని ప్లాన్ చేసారంట డైరెక్టర్ బాబీ. ఈ నెల 20 నుండి దాదాపు 25 రోజుల పాటు అక్కడే నిరవధికంగా షూటింగ్ జరపాలని నిర్ణయించారట.

వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ నటిస్తుండగా, చైతూ కి జోడిగా రాశీ ఖన్నా నటించనుంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ స్వరాలు సమకూర్చనున్నారు. దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.

సంబంధిత సమాచారం :

More