‘వెంకీ మామ’కు ఘనమైన ఆక్యుపెన్సీ !

Published on Dec 13, 2019 7:50 pm IST

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. దగ్గుబాటి, అక్కినేని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఘనమైన ఆక్యుపెన్సీను సొంతం చేసుకుంది. ఉదయం మరియు మధ్యాహ్నం షోలలో ఆక్యుపెన్సీ దాదాపు 80% పైగానే ఉంది. మొదటి రోజు కలెక్షన్లు చాలా బాగుంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వారాంతపు రోజుల్లో కూడా పెద్ద సినిమాలు ఏవి పోటీగా లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది.

ఇక ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో ఆయన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. కాగా ఈ సినిమలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటించగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరిసింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More