ట్రావెల్ బస్సులో ప్రత్యక్షమైన ‘వెంకీ మామ’

Published on Dec 17, 2019 1:02 pm IST

అనేక కారణాల వలన సినిమా పరిస్థితి ప్రశ్నార్థంగా తయారవుతున్న తరుణంలో పైరసీ నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తుంది. పైరసీ అదుపునకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంతమేర కూడా అరికట్టలేకపోతున్నారు. సినిమా విడుదలైన సాయంత్రానికి పైరసీ ప్రింట్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. అనేక మంది వాటిని రోడ్ల పక్కనే విచ్చల విడిగా అమ్మేస్తున్నారు. కొందరికి పైరసి చూడటం నేరం అనే ఆలోచన ఆవగాహన కూడా ఉండని పరిస్థితి. విడుదలై నాలుగు రోజులు కాకుండానే వెంకీ మామ చిత్రం ఓ ట్రావెల్ బస్సులో ప్రదర్శన ఇవ్వడం చిత్ర నిర్మాతలకు షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వెంకీ మామ సీడిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కొద్దిరోజుల క్రితం యంగ్ హీరో నిఖిల్ తన మూవీ సక్సెస్ టూర్ లో భాగంగా గుంటూరు వెళ్లగా అక్కడ రోడ్డు ప్రక్కనే అర్జున్ సురవరం పైరసీ సీడీలు అమ్మడం చూసిన ఆయన షాక్ గురవడంతో పాటు, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పైరసీ కారణంగా వేల కోట్ల రూపాయలు నిర్మాతలు నష్టపోతున్నారు. నానాటికి పెరిగిపోతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పైరసీ నేరగాళ్లు సైబర్ చట్టాలకు సవాల్ విసురుతున్నారు.

సంబంధిత సమాచారం :