‘వెంకీ మామ’కి రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Oct 15, 2019 11:36 am IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా
ఈ సినిమాని కొన్ని రోజుల క్రితం, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు మేము వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా అధికారిక ధృవీకరణ జరగనప్పటికీ, మేకర్స్ ఈ తేదీనే తమ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More