హాలీవుడ్ మూవీ కోసం.. వెంకీ, వరుణ్.. !

Published on Apr 26, 2019 10:00 pm IST

డైరెక్ట‌ర్ ‘గై రిట్‌చ్చి’ దర్శకత్వంలో వస్తోన్న మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ అమెరిక‌న్ చిత్రం ‘అల్లాద్దీన్‌’. ఈ చిత్రంలో విల్ స్మిత్‌, మీన మ‌సూద్న‌, సీమ్‌పెడ్రాడ్‌, న‌మి స్కోట్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. కాగా వచ్చే నెల 24వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే అల్లాద్దీన్‌ కోసం విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ తమ గొంతును అరువిచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు అనువాదానికి సంబంధించి అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్, జీనీ పాత్రకు వెంకటేష్ డబ్బింగ్ కూడా చెప్పేశారట. ఇక ఈ చిత్రానికి ఎలెన్ మెన్‌కెన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన మూడు ట్రైల‌ర్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ సంస్థ నుండి ఈ సినిమా రానుంది.

సంబంధిత సమాచారం :