యువ దర్శకుడితో నితిన్ సినిమా ?
Published on Feb 23, 2018 8:40 am IST

హీరో నితిన్ ప్రస్తుతం ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు కొత్త కథల్ని వింటున్నాడీ హీరో. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల మేరకు నితిన్ ఒక యువ దర్శకుడడితో సినిమా చేసే అవకాశాలున్నాయట. ఆ దర్శకుడు మరెవరో కాదు డెబ్యూ చిత్రం ‘ఛలో’తో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల.

‘ఛలో’ హిట్ తర్వాత నిర్మాణ సంస్థల నుండి వరుస ఆఫర్లు అందుకంటున్న వెంకీ భిన్నమైన స్టోరీ లైన్ తో కూడిన కథను నితిన్ కు చెప్పాలనుకుంటున్నాడట. ఒకవేళ నితిన్ గనుకు వెంకీ కథకు ఇంప్రెస్ అయితే వీరి సినిమా త్వరలోనే పట్టాలేకొచ్చు. వెంకీ గతంలో నితిన్ చేసిన ‘అ ..ఆ’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన సంగతి తెల్సిందే.

 
Like us on Facebook