పాయల్ తో వెంకీది రొమాంటిక్ సాంగేనా..?

Published on Nov 15, 2019 9:05 pm IST

వెంకీ మామ నుండి సెకండ్ సింగిల్ రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ల మధ్య అనుభంధాన్ని తెలియాజేసేదిలా ఉన్న ఈ సాంగ్ మంచి ఆదరణే దక్కించుకుంది. ఇక సెకండ్ సింగల్ వెంకటేష్, పాయల్ రాజ్ పుత్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్. ఈ పాటను థమన్ ప్రత్యేకంగా 80ల కాలం నాటి ట్యూన్ ని పోలి ఉండేలా స్వరపరిచారట. ముఖ్యంగా వెంకీ – పాయల్ మధ్య రొమాన్స్ ను ఈ సాంగ్ హైలెట్ చేస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ పాటలకు సంబంధించిన పోస్టర్ లో వెంకీ ఎన్టీఆర్ అడవిరాముడు, డ్రైవర్ రాముడు కాలం నాటి డ్రెస్సింగ్ స్టయిల్ లో కనిపిస్తున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :