వైరల్ అవుతున్న వెంకీమామ లీకడ్ వీడియో !

Published on Feb 27, 2019 6:00 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ల మల్టీస్టారర్ ‘వెంకీమామ’ మొదటి షెడ్యూల్ ఇటీవల రాజమండ్రి లో ప్రారంభమైంది. గోదావరి నది తీరాన వెంకీ , చైతూ లపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యింది. 26 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇంట్రో సీన్ మాత్రం బాగుంది. వెంకీ ,చైతూ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు.

బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :