విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వెంకిమామ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షెడ్యూలు ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుందని సమాచారం. వెంకటేష్ తన తదుపరి చిత్రం సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించనున్న “దే దే ప్యార్ దే” హిందీ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. నిర్మాత సురేష్ బాబు ఈ విషయం ఇంతకు ముందే ధ్రువీకరించడం జరిగింది. ఐతే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా 2016లో ‘డిక్టేటర్’ మూవీకి దర్శకత్వం వహించిన శ్రీవాసు కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట.
శ్రీవాసు దర్శకత్వం వహించిన చివరి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన “సాక్ష్యం” ఆశించినంత విజయం సాధించలేదు. ఇదే కనుక జరిగితే శ్రీవాసు కి మంచి అవకాశం దక్కినట్లే.ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన జరగలేదు. అజయ్ దేవగణ్ హీరో గా టబు,రకుల్ హీరోయిన్స్ గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన “దే దే ప్యార్ దే” హిందీలో మంచి వసూళ్లను రాబట్టింది.


