‘ఏబిసిడి’లో మోస్ట్ వాంటెడ్ ఫుల్ కామెడీ !

Published on May 5, 2019 4:50 pm IST

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం లేని లోటు తీరుస్తోన్న ఏకైక కమెడియన్ వెన్నెల కిశోరే అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపొబ్బా నవ్వించడంతో పాటు, ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్రను పోషించాడు ఈ మోస్ట్ వాంటెడ్ కమెడియన్. అయితే ప్రస్తుతం వెన్నెల కిశోర్ మరో సినిమాతో కూడా నవ్వులతో ముంచెత్తడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ‘ఏబిసిడి’ సినిమాలో వెన్నెల కిశోర్ టీవీ యాంకర్ గా నటిస్తున్నాడట. తన శైలి కామెడీతో సినిమాలో వెన్నెల కిశోరే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో అప్పుడప్పుడే కనిపించినా ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తాడట. ఆ మధ్య ‘గీత గోవిందం’లో వెన్నెల కిశోర్ కామెడీ ఎంత బాగా హైలెట్ అయిందో.. ‘ఏబిసిడి’లో కూడా కామెడీ ఆ స్థాయిలో హైలెట్ అవుతుందట.

ఇక అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ కి ఈ సినిమానైనా భారీ హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More