‘సిటీమార్’లో వెన్నెల కిశోర్ కామెడీ !

Published on Apr 1, 2020 5:13 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ లో హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీ సిటీమార్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయట. ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే సినిమాలో పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేయమని.. అలాగే బడ్జెట్ ను తగ్గిస్తే మంచిదని గోపీచంద్ సంపంత్ కి సూచించాడట.

అందుకు తగ్గట్లుగానే సంపత్ నంది స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట.. అలాగే కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడట. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More