‘భీష్మ’లో వెన్నెల కిశోర్ తెగ నవ్విస్తాడట

Published on Jul 12, 2019 12:02 am IST

ప్రజెంట్ తెలుగులో ఉన్న యువ కామెడియన్లలో వెన్నెల కిశోర్ బాగా పాపులర్. ఎలాంటి ఫన్నీ పాత్రనైనా అవలీలగా చేస్తూ హాస్యాన్ని పండించగలగడం వెన్నెల కిశోర్ స్పెషాలిటీ. అందుకే ఆయన కోసం పనిగట్టుకుని మరీ తమ సినిమాల్లో పాత్రలు రాస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం నితిన్ చేసున్న ‘భీష్మ’లో కూడా వెన్నెల కిశోర్ నటిస్తున్నాడు.

ఇందులో ఆయన పాత్ర పేరు పరిమళ. ఈ పేరు వింటుంటే పేరే ఇంత నవ్వు తెప్పిస్తుంటే ఇక పాత్ర చేసే కామెడీ ఇంకెంత నవ్విస్తుందో అనిపిస్తోంది. నితిన్ సైతం వెన్నెల కిశోర్ లాంటి నటుడితో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈమధ్యే చిత్ర షూటింగ్ కూడా మొదలైంది.

సంబంధిత సమాచారం :

X
More