‘రాగల 24గంటల్లో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Nov 18, 2019 8:03 pm IST

ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ రాగల 24గంటల్లో. ఢమరుకం ఫేమ్ దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ హత్య చుట్టూ నడిచే సస్పెన్సు అంశాలతో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారని సమాచారం. నటుడు శ్రీరామ్ ఈచిత్రంలో పోలీస్ అధికారి పాత్ర చేయడం జరిగింది. శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్నారు. రఘు కుంచె రాగాల 24 గంటల్లో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈచిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. దీనితో సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా బుధవారం అనగా ఈనెల 20న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటన చేయడం జరిగింది. దాసపల్లి కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం 6గంటల నుండి ఈ కార్యక్రమం జరుగనుంది. హీరోహీరోయిన్లతో పాటు, దర్శక నిర్మాతలు, టాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరుకానున్నారని సమాచారం. రాగల 24గంటల్లో చిత్ర ట్రైలర్ ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం :

X
More