లేటెస్ట్..”హను మాన్” ట్రైలర్ లాంచ్ కి వేదిక ఖరారు.!

hanuman

ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ లవర్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ విజువల్స్ అండ్ గ్రాండ్ యాక్షన్ చిత్రం “హను మాన్” కూడా ఒకటి.

అయితే మన టాలీవుడ్ నుంచి వస్తున్నా ఓ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ఇది కాగా ఆడియెన్స్ లో ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం నుంచి అయితే అంతా ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కట్ ని మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ని ఈ డిసెంబర్ 19కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ని ఇప్పుడు మేకర్స్ ఫిక్స్ చేసారు. మరి ఈ ట్రైలర్ ని అయితే 19న హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో స్క్రీన్ లో ఉదయం 10 గంటలకి లాంచ్ చేస్తున్నట్టుగా లాక్ చేశారు.

దీనితో ఆ తర్వాత ఆన్లైన్ లో ఈ మాసివ్ ప్రాజెక్ట్ ట్రైలర్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version