పవన్ సినిమా కోసం ఫస్ట్ టైం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ !

పవన్ సినిమా కోసం ఫస్ట్ టైం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ !

Published on Apr 24, 2020 10:34 PM IST

Keeravani PawanKalyan

క్రిష్ – పవన్ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయబోతున్నారు. ప్రముఖ సంగీత స్వరకర్త ఎం.ఎం కీరవాణి , క్రిష్ – పవర్‌ స్టార్ సినిమాకి పని చేస్తోన్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కీరవాణి ఈ వార్తను ధృవీకరించారు. పవన్ 2-దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించడం ఇదే మొదటిసారి.

కాగా క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది.

ఇక కరోనా మహమ్మారి పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను బాగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ ఒప్పుకుంటన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు