‘మహర్షి’ ప్రబోధాత్మక చిత్రం.. నా అభినందనలు – ఉపరాష్ట్రపతి

‘మహర్షి’ ప్రబోధాత్మక చిత్రం.. నా అభినందనలు – ఉపరాష్ట్రపతి

Published on May 15, 2019 10:08 AM IST

mahesh venyanidu

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ హిట్ టాక్ తో సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా
ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమాని చూసిన కొందరు సినీ ప్రముఖులు మహేశ్ బాబు నటన పై, అలాగే మహర్షి చిత్రబృందం పై ప్రశంసల వర్షం కురిపించారు.

కాగా తాజాగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు