ఆఫీషియల్..వెంకీ “నారప్ప” కూడా వాయిదా.!

Published on Apr 29, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. అభిమానులు అంతా వెంకీ మామగా పిలుచుకునే వెంకటేష్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “నారప్ప”. కోలీవుడ్ చిత్రం “అసురణ్” కు రీమేక్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. అయితే అన్ని పనులు జరిగిపోయి సినిమా విడుదలను కూడా మేకర్స్ వచ్చే మే లో కన్ఫర్మ్ కూడా చేసేసారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ సమయానికి రావడం లేదు అని అధికారిక ప్రకటన ఇచ్చారు. “ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికి ఆరోగ్యం మరియు రక్షణ దృష్ట్యా సినిమా వాయిదా వేస్తున్నామని మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక త్వరలోనే విడుదల చేసేందుకే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

అంతే కాకుండా అందరూ ఇళ్లలోనే ఉండి కలసికట్టుగా కరోనా ను అరికట్టాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తే అందరికీ సమాజానికి గొప్ప సాయం చేసిన వారు అవుతారని” నారప్ప యూనిట్ తెలియజేసారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా కళైపులి మరియు దగ్గుబాటి సురేష్ బాబులు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :