నా భార్య 12th ఫెయిల్‌ ను OTTలో విడుదల చేయమని చెప్పింది – విధు వినోద్ చోప్రా

నా భార్య 12th ఫెయిల్‌ ను OTTలో విడుదల చేయమని చెప్పింది – విధు వినోద్ చోప్రా

Published on Feb 4, 2024 9:07 PM IST

విక్రాంత్ మాస్సే మరియు మేధా శంకర్ నటించిన 12th ఫెయిల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా దాదాపు 57 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 12th ఫెయిల్ ఐపిఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ మరియు ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషి నిజ జీవిత కథల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ జరిగింది. సక్సెస్ ఫుల్ మీట్ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత విధు వినోద్ చోప్రా షాకింగ్ విషయాలను వెల్లడించారు. మేము 12th ఫెయిల్‌ని విడుదల చేయబోతున్నప్పుడు, నా భార్య అనుపమ చోప్రా (ప్రఖ్యాత సినీ విమర్శకురాలు)తో సహా అందరూ దీనిని OTT లో విడుదల చేయమని నాకు సలహా ఇచ్చారు. విధు వినోద్ చోప్రా ఇంకా మాట్లాడుతూ, 12th ఫెయిల్ థియేటర్లలో వర్క్ అవ్వదు అని అందరూ నాతో చెప్పారు. విక్రాంత్ చూడటానికి ఎవరూ థియేటర్లకు రారని చెప్పారు. 12th ఫెయిల్ మొదటి రోజు 2 లక్షలు మరియు లాంగ్ రన్ లో మొత్తం 30 లక్షలు వసూలు చేస్తుందని కొన్ని వ్యాపార సంస్థలు తెలిపాయి. ఈ సినిమా తక్కువ ఓపెనింగ్స్ తెచ్చి ఉండేది, అయితే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో అనుపమ చోప్రా మాట్లాడుతూ, అవును, సినిమాను థియేటర్లలో విడుదల చేయవద్దని నేను అతనితో (విధు వినోద్ చోప్రా) చెప్పాను. 12th ఫెయిల్ వంటి చిత్రాలను ఎవరూ థియేటర్లలో చూడరని అనుకున్నాను. నేను పూర్తిగా తప్పు, మరియు నా భర్త చెప్పింది నిజమే. 12th ఫెయిల్, స్టార్స్ లేని సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగితే అద్భుతాలు చేయగలదని నిరూపించింది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు