ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెట్టిన విద్యాబాలన్ !

Published on Jul 18, 2018 8:58 am IST


దర్శకుడు క్రిష్, నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయింది. కాగా ఇటీవలే విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ లో తాను చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు.

ఐతే ఆమె నిన్న ‘ఎన్టీఆర్‌’ సెట్లోకి అడుగుపెట్టారు. బసవతారకంగారి గురించి మొత్తం తెలుసుకొని విద్యాబాలన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ చిత్రాలని కూడా ఆమె చూశారట. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ గారు బసవతారకంగారి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే దృశ్యాలను ఈ మొదటి షెడ్యూల్ లో తెరెకెక్కించనున్నారని తెలుస్తోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :