మెగాస్టార్ ‘గాడ్‌ ఫాదర్‌’లో విద్యాబాలన్ ?

Published on Aug 30, 2021 3:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న క్రేజీ సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ పై ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్రను తెలుగు వెర్షన్ లో ఆ పాత్రలో బాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతుందట. మెగాస్టార్ కి సిస్టర్ గా విద్యాబాలన్ చేస్తే.. ఈ కాంబినేషన్ నిజంగానే అదిరిపోతుంది. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో విద్యాబాలన్ నటిస్తే చాల బాగుంటుంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని దర్శకడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :