మరో బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ నటి !

Published on Feb 1, 2019 1:28 am IST


బాలీవుడ్ నటి విద్యా బాలన్ బయోపిక్ చిత్రాలకు ఆప్షన్ లా మారింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటు తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా నటించనుంది.

ఇక ఇప్పుడు విద్యా తాజాగా మరో బయోపిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. హ్యూమన్ కంప్యూటర్ , ప్రముఖ మ్యాథమేటీషియన్ శంకుతల దేవి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది ఈ చిత్రం. ఈచిత్రంలో శంకుతల దేవి పాత్రలో విద్యా బాలన్ కనిపించనుంది. అను మీనన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

X
More