సన్ టీవీ చేతికి విజయ్ 63 !

Published on Mar 20, 2019 2:00 am IST

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తలపతి 63 షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ రైట్స్ ను మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం యొక్క శాటిలైట్ , డిజిటల్ రైట్స్ విలువ 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. ఇక అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘తెరి ,మెర్సల్’ చిత్రాలు మంచి విజయాలు సాధించడం తో ఈ మూడవ సినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More