మేడం తో ప్రేమలో పడ్డ విజయ్ దేవరకొండ

Published on Dec 14, 2019 8:41 pm IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. టైటిల్ కి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో నలుగురి అమ్మాయిలతో ఫేమస్ లవర్ గా కనిపించనున్నాడు. కాగా గత రెండు రోజులుగా ఈ మూవీ నుండి విజయ్ తో పాటు ఉన్న ఒక హీరోయిన్ లుక్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదటిగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను విజయ్ భార్యగా పరిచయం చేయగా నిన్న ఇసాబెల్లా లుక్ రివీల్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో మరో హీరోయిన్ క్యాథెరిన్ థెరిస్సా మరియు విజయ్ ల పోస్టర్ నేడు విడుదల చేశారు.

హీరోయిన్ క్యాథరిన్ సుస్మిత అనే కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా ఆ కంపెనీలో పనిచేసే కార్మికుల నాయకుడు శ్రీనుగా విజయ్ కనిపిస్తున్నారు. కాగా ఈ శ్రీను మేడం సుస్మితను ప్రేమలోకి ఎలా దించాడో చూడాలిమరి. ఇక రేపు వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ప్రధాన హీరోయిన్ రాశి ఖన్నా లుక్ రివీల్ చేయనున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె వల్లభ నిర్మిస్తుండగా, దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More