విజయ్ ఆంటోనికి సపోర్ట్ చేస్తున్న రానా దగ్గుబాటి..!

Published on Aug 1, 2021 3:00 am IST

తమిళ హీరో విజయ్ అంటోనీ విభిన్న చిత్రాలు చేస్తూ నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో తమిళ్, తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేశాడు. అయితే తాజాగా విజయ్ అంటోనీ “విజయ రాఘవన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఆత్మిక నటిస్తోంది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

అయితే యాక్షన్-ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం హీరో రానా దగ్గుబాటి విజయ్ అంటోనికి సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రానా చేతుల మీదుగా ఆగష్టు 2 సోమవారం సాయంత్రం 5:01 గంటలకు “విజయ రాఘవన్” ట్రైలర్‌ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

సంబంధిత సమాచారం :