విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ లేటెస్ట్ అప్ డేట్ !

విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 24, 2020 12:48 PM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తోన్నాడు. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ స్ తీస్తున్నారట. ముందుగా విలన్ పై ఈ సీన్స్ తీస్తున్నారట. ఆ తరువాత విజయ్ దేవరకొండ పై షూట్ చేయనున్నారు.

కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు