బన్నీ రికార్డ్ బద్దలుకొట్టిన విజయ్ దేవరకొండ..!

Published on Sep 3, 2021 12:14 am IST


టాలీవుడ్ రౌడీబాయ్‌గా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా బన్నీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇటీవ‌ల అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ని సాధించి సరికొత్త రికార్ద్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలోనే ఈ రికార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ నెలకొల్పాడు. అయితే ఈ రికార్డ్ ఎక్కువ రోజులు నిలవలేదు.

మొదటి నుంచి ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండకు మధ్య గట్టి పోటీ నడుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ కూడా 13 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని రీచ్ అయ్యాడు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :