విజయ్ దేవరకొండ కూల్ లుక్ అదిరిందిగా..!

Published on Aug 11, 2021 11:38 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ సినిమా కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సాయంత్రం తనదైన స్టైల్‌లో వర్క్ చేస్తూ విజయ్ అభిమానులను కనువిందు చేశాడు.

అయితే ‘మీ అబ్బాయి తిరిగి వచ్చాడు’, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి.. ముందుకు సాగిపోండని ట్వీట్ చేశాడు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం పేపర్ చేతిలో పట్టుకుని మైక్ ముందు కూర్చుని డబ్బింగ్ చెబుతున్నా విజయ్ కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :