విజయ్ గట్స్..”లైగర్” తన నుంచి షాకింగ్ లుక్ రివీల్.!

Published on Jul 2, 2022 10:57 am IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ని కంప్లీట్ గా కొత్తగా ప్రెజెంట్ చేసిన పూరి సినిమా రోల్ కి తగ్గట్టుగా ఫస్ట్ టైం విజయ్ తో 6 ప్యాక్ కూడా చేయించాడు. మరి ఈ సినిమా నుంచి అయితే విజయ్ కంప్లీట్ సాలిడ్ లుక్ ని అయితే మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు.

అయితే ఇందులో విజయ్ తన జిమ్ బాడీతో స్టన్నింగ్ గా ఉన్నా సరిగ్గా గమనిస్తే బొకే పట్టుకొని తన ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా డేరింగ్ స్టెప్ తో షాకింగ్ లుక్ ని రివీల్ చేసాడు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని చెబుతూ ఇలాంటి ఒక లుక్ ని రివీల్ చేసి తన గట్స్ ని ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :