పండగ పోస్టర్ లో కూడా విజయ్ పంధా మార్చలేదు

Published on Jan 16, 2020 1:00 am IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. సంక్రాంతి సంధర్భంగా విశెష్ చెవుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేశారు. చొక్కా లేకుండా బేర్ బాడీ తో ఉన్న విజయ్ దేవరకొండ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఐతే తెలుగు పండుగ రోజు కూడా ఇలాంటి పోస్టర్ ఏమిటీ అనేలా.. విజయ్ గెటప్ ఉంది. ఈ చిత్రంలో నలుగురు అమ్మాయిలతో వివిధ కాలాలలో విజయ్ దేవరకొండ ప్రేమ నడిపిస్తాడని అర్థం అవుతుంది. ఐతే విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాలైన అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ చిత్రాలలో వలే విజయ్ భగ్న ప్రేమికుడిగా కనిపిస్తారని తెలుస్తుంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల రెండవ వారం ఈ మూవీ విడుదల కానుంది. ఇక విజయ్ దర్శకుడు పూరి దర్శకత్వంలో చేస్తున్న ఫైటర్ మూవీ జనవరి 20 నుండి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం :