బాలీవుడ్ లో విజయ్ కి అంత క్రేజ్ ఉందా ?

Published on Mar 30, 2020 5:15 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటనతో పాటు స్టైల్ పరంగా కూడా ఫుల్ పాపులారిటీని అండ్ ఫుల్ క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ తో అప్ డేట్ అవుతూ ఇంతకుముందెన్నడూ ఏ తెలుగు హీరో కనిపించని విధంగా కనిపిస్తూ మొత్తానికి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య విజయ్ క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఒక్క సినిమా చేయకుండానే.. అక్కడ అంత పాపులారిటీ సాధించడం చూసే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరుణ్ జోకార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడట.

దీనికితోడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాన్వి కపూర్, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తమ ఫెవరేట్ హీరో అని అంతే కాకుండా విజయ్ అమేజింగ్ స్టార్ అని కూడా చెప్పుకొచ్చారు. దీనిబట్టి అక్కడ విజయ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయినా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎందరో ఉండగా బాలీవుడ్ కు విజయ్ దేవరకొండ ఎందుకు నచ్చుతున్నాడో .. ఇక పూరి దర్శకత్వంలో వస్తోన్న ఫైటర్ సినిమాతో బాలీవుడ్ లోకి విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More