నెక్స్ట్ మూవీలాంచ్ … బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ.

Published on May 18, 2019 12:00 am IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో తన అభిమానులను అలరించనున్నారు. తన లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో మూవీని మొదలుపెట్టనున్నారు. ఫేమస్ రైటర్ ఆనంద్ అన్నామలై దర్శకుడిగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ నెల 20 ఢిల్లీలో ఓ మూవీ ప్రారంభించనున్నాడు విజయ్. క్రీడా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ మూవీ లో విజయ్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడని సమాచారం.

విజయ్ పాపులారిటీ దృష్ట్యా ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ మరియు కన్నడ భాషలలో కూడా విడుదల చేయాలనీ భావిస్తున్నారట నిర్మాతలు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పాత్రల కోసం ప్రముఖ నటులను తీసుకొనే ఆలోచనఉన్నారట. “హీరో” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More