టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరనుండి ఈ సినిమాలో విజయ్ ఎలా కనిపిస్తాడా.. ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా.. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లుక్‌తో ఊరమాస్ అవతారంలో ఎంట్రీ ఇచ్చాడు. చొక్కా లేకుండా కేవలం లుంగీ కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని గూండాలపై విరుచుకుపడుతూ ఊచకోతకు సిద్ధమయ్యాడు. ఇక ఈ క్రమంలో విజయ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘కళింగపట్టణంలో ఇంటికో ****కొడుకు నేను రౌడీ అని చెప్పుకుతిరుగుతాడు.. కానీ, ఇంటిపేరే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్థన.. రౌడీ జనార్థన’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ మాస్ ట్రీట్ అందించింది.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తుండగా డిసెంబర్ 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


